తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 28: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బస్టాండ్ సెంటర్లో ఖమ్మం-వరంగల్ నేషనల్ హైవేపై శనివారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ.. ‘మాది ఇందిరమ్మ రాజ్యం’ అంటూ చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం నిరుపేదల ఇండ్లను జేసీబీలు, బుల్డోజర్లతో నిరంకుశంగా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు లక్ష చొప్పు న నష్టపరిహారం చెల్లించాలని, అదే స్థలం లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.