శిశిరంలో వసంతం హోలీ
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలీ కేళి రెట్టింపు చేస్తుంది.
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలీ కేళి రెట్టింపు చేస్తుంది. ఫాల్గుణోత్సవం, కల్యాణ పూర్ణిమ, వసంత పున్నమి, హుతాశని పౌర్ణమి, కాముని పున్నమి, మదనోత్సవం, డోలా పూర్ణిమ, అనంగ పూర్ణిమ ఇలా ఎన్నో పేర్లతో పాల్గుణ పూర్ణిమ నాడు హోలి పర్వదినాన్ని నిర్వహిస్తారు.
గాథాసప్తశతి, కామసూత్రాలు, నాగావళి వంటి గ్రంథాల్లో హోలి వైభవ ప్రస్తావన ఉంది. శిశు హంతకి అయిన రాక్షసి హోలిక వినాశనానికి సూచికగా హోలి పర్వదినం ఏర్పడిందని చెబుతారు. అగ్ని కూడా దహించలేని శక్తిమంతురాలైన హోలిక హిరణ్యకశిపుడి సోదరి. ప్రహ్లాదుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. హరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శ వల్ల హోలిక శక్తి సన్నగిల్లి ఆమె అగ్నికి ఆహుతి ఆవుతుంది. ఆ అగ్నికీలల నుంచి ప్రహ్లాదుడు ఏ గాయమూ లేకుండా బయటికి వస్తాడు. అలాగే ‘దుంధ’ అనే రాక్షసి అంతానికి సంతోషంగా ప్రజలు హోలి జరుపుకొనే సంప్రదాయం ఏర్పడిందని భవిష్య పురాణ కథ.
హోలి వేడుకను ఉత్తర భారతదేశంలో డోలాజాత్రాగా కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాధాకృష్ణుల మూర్తులను ఊయలలో ఉంచి లాలిపాటలను ఆలపిస్తారు. ఆ సందర్భంగా రంగుల్ని కూడా చిలకరించుకుంటారు. ఇక మథుర, బృందావనంలో హోలీ వేడుక కన్నులపండువగా సాగుతుంది.
ప్రకృతి సహజమైన రంగులతోనే హోలి జరుపుకోవాలి. హానికరమైన కృత్రిమ రంగులు చల్లుకోవడం సంప్రదాయ విరుద్ధం. ఫల, పుష్ప రసాలను సమ్మిళితం చేసి రంగులుగా చిలకరించుకోవచ్చు. పసుపు కలిపిన చందనం, అష్టగంధం, వృక్షమూలాల రసం, మోదుగ పుష్పాల గుజ్జు, మందార పువ్వులు, గులాబీ పువ్వుల నుంచి తీసిన రసం కలిపిన జలాన్ని హోలి రంగులుగా వినియోగించడం మన సంప్రదాయం. పర్యావరణ హితంగా హోలి నిర్వహించడం వల్ల శరీరానికీ, మనసుకు ఆహ్లాదం చేకూరుతుంది. మొత్తంగా ఈ పండుగ అంతరార్థం అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే.
ఎన్నెన్నో వర్ణాలు..
- మానవ జీవితం సప్తవర్ణ సమన్వితం. ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ రంగులలో ఉన్న కళాత్మక విన్యాసం మనిషి కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
- ఎరుపు అన్ని వర్ణాల కన్నా ఎక్కువగా ఉత్తేజాన్నిస్తుంది. ఉత్సాహభరితమైనది ఏదైనా ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు ప్రేమకు చిహ్నం.
- నీలం రంగు అన్నిటినీ తనలో కలుపుకొనే తత్త్వం గలది. మన అవగాహనకు మించినది ఏదైనా, సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. అది సముద్రం అయినా, ఆకాశం అయినా సరే.
- ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తులు నారింజ రంగును ఎంచుకుంటారు. యోగసాధనలో ఆజ్ఞా చక్రం కదులుతున్నప్పుడు, అది నారింజ రంగులో ఉంటుంది. ఈ వర్ణం త్యాగాన్ని సూచిస్తుంది.
- శరీరంలో అత్యంత ప్రాథమిక చక్రమైన మూలాధారం వర్ణం పసుపు.
- హరిత వర్ణం ప్రశాంతమైన మనసుతో స్పష్టతను అందిస్తుంది. పచ్చ.. వృద్ధి, పునరుద్ధరణ, శాంతిని తెలియజేస్తుంది.
- తెలుపు నుంచే అన్ని రంగులూ ఉద్భవిస్తాయి. తెలుపు పవిత్రతను, శాంతిని, స్వచ్ఛతను తెలుపుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

