రోడ్డెక్కిన పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు
ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు సమరశంఖం పూరించారు. ఉద్యోగాల కో సం పోలీస్ నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు రోడ్డెక్కారు. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇ వ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
- దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా హల్చల్
- 5 వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌పై నిరసన
- 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కోటి సంతకాల సేకరణ
- ఇద్దరు నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ఎల్బీనగర్, జూన్ 10 : ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు సమరశంఖం పూరించారు. ఉద్యోగాల కో సం పోలీస్ నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు రోడ్డెక్కారు. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇ వ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్ శాఖ లో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో బుధవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని రోడ్లపైకి ని రుద్యోగ అభ్యర్థులు ఒక్కసారి వెల్లువలా వచ్చారు. ‘ఐదు వేల పోస్టులు వద్దు.. 20 వేల పోస్టులు కావా లి’ అంటూ బ్యానర్ పట్టుకుని పెద్ద పెట్టున నినాదా లు చేశారు. జేఏసీ నేతలు నవీన్ పట్నాయక్, ఆకాశ్, శంకర్, షింబూ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేవలం 5 వేల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేస్తే సగం పోస్టు లు హైదరాబాద్‌లోనే భర్తీ చేస్తారని, మిగిలిన 2,500 పోస్టులు అన్ని జిల్లాలకు కేటాయిస్తే.. జిల్లా ల్లో కొందరికి కూడా ఉద్యోగాలు రావని ఆవేదన వ్యక్తంచేశారు. 2022 నుంచి 2026 వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని, వయోభారం పెరుగడంతో కానిస్టేబుల్‌కు 36, ఎస్ఐకి 38 ఏండ్ల వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ అంశంలో కూడా 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. అధికారంలోకి రాకముందు ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు.
జేఏసీ నేతల అరెస్టు
పోలీస్ నిరుద్యోగ జేఏసీ ర్యాలీలో మద్దతుగా పాల్గొన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్, బీఈడీ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యాకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారంటూ అభియోగం మోపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు తమపై కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు.
లక్ష సంతకాల సేకరణ
పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం చైతన్యపురిలోని అస్పెరెంట్స్ అడ్డా టీ షాపు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యానర్‌పై 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలంటూ నిరుద్యోగులు భారీ ఎత్తున సంతకాలు చేశారు.
నిరుద్యోగులను ముంచిన కాంగ్రెస్ సర్కార్: ఎర్రోళ్ల
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రెండున్నరేండ్లు దాటినా నిర్లక్ష్యం చేస్తూ నిండా ముంచుతున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నాడు నిరుద్యోగుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పుడు వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ, విదేశీ పర్యటనల్లో మునిగితేలుతుంటే, ఉద్యోగాల జాడలేక నిరుద్యోగులు మాత్రం నిరాశలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

