సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ైక్లెమాక్స్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ కోసం 20కోట్ల వ్యయాన్ని కేటాయించామని, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరిస్తామని మేకర్స్ తెలిపారు. యుద్ధ భూమిని తలపించేలా రూపొందిస్తున్న ైక్లెమాక్స్ ఘట్టాలు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తుకు తెస్తాయని, స్టన్నింగ్ విజువల్స్‌తో ఆకట్టుకుంటాయని చిత్రబృందం పేర్కొన్నది.
ఈ చిత్రంలో హీరో సాయిదుర్గతేజ్ మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త పంథాలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, రచన-దర్శకత్వం: రోహిత్ కె.పి.