ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది.
దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన షేర్హోల్డర్లకు పండుగ బొనాంజా ఇస్తున్నది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను, రూ.6,940 కోట్ల విలువైన మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. గురువారం యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది.
రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.110.3 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Credit card bills | క్రెడిట్ కార్డుదారులకు వెసులుబాటు కల్పించే కొత్త నిబంధనను రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చింది. ఈ నిబంధన మేరకు క్రెడిట్ కార్డుదారులు గడువు దాటిన తర్వాత 3 రోజుల వరకు వడ్డీలు, అపరాధ రుసం వసూలు చేయకూడదు.