woman employee kicks patient | రోగిని కాళ్లతో తన్నిన మహిళా ఉద్యోగిని.. వీడియో వైరల్‌తో సస్పెండ్
woman employee kicks patient | ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని ఒక రోగి పట్ల అమానుషంగా వ్యవహరించింది. అతడ్ని పలుసార్లు కాళ్లతో తన్నింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు.
లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని ఒక రోగి పట్ల అమానుషంగా వ్యవహరించింది. అతడ్ని పలుసార్లు కాళ్లతో తన్నింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. (woman employee kicks patient) ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నేలపై పడున్న ఒక మానసిక రోగి పట్ల మహిళా ఉద్యోగిని అమానుషంగా ప్రవర్తించింది. సుమారు 35 సెక్షన్ల వ్యవధిలో పది సార్లు తన కాళ్లతో అతడ్ని తన్నింది. అలాగే ఆ వ్యక్తిని దూషించింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగిని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశించారు. ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న పింకీపై జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Uttar Pradesh: A contractual sanitation worker at the District Men’s Hospital in Raebareli has been suspended after a viral video allegedly showed her kicking a mentally challenged man multiple times inside the hospital premises.
According to hospital staff, the woman,… pic.twitter.com/eJRcviJnLZ
— The Siasat Daily (@TheSiasatDaily) June 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

