డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయం
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా ఉత్పత్తుల సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,112.80 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
- క్యూ2లో 12% పెరిగిన లాభం
- రూ.1,113 కోట్లుగా నమోదు
హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ బిజినెస్): రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా ఉత్పత్తుల సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,112.80 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.992 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.6,305.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది నమోదైన రూ.5,215.40 కోట్లతో పోలిస్తే తొమ్మిది శాతం అధికమని పేర్కొంది.
- 775 మిలియన్ డాలర్ల ఆదాయంపై 137 మిలియన్ డాలర్ల నికర లాభం.
- అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలను విక్రయించడంతో సంస్థకు రూ.4,743 కోట్ల నిధులు సమకూరాయి. వీటిలో ఉత్తర అమెరికా నుంచి రూ.1,890 కోట్లు రాగా, యూరప్ నుంచి రూ.413 కోట్లు, భారత్ నుంచి రూ.1,140 కోట్లు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.1,298 కోట్లు లభించాయి.
- ఫార్మాస్యూటికల్స్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్‌తో రూ.837 కోట్ల నిధులు సమకూరాయి.
- గత త్రైమాసికంలో ఆర్అండ్డీ కోసం సంస్థ రూ.490 కోట్ల నిధులు వెచ్చించింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.580 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.11,521 కోట్ల ఆదాయంపై రూ.2,300 కోట్ల లాభాన్ని గడించింది.
‘ప్రస్తుత త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నది. అమెరికా మార్కెట్లోకి లెనాలిడోమిడ్ క్యాప్సల్ను విడుదల చేయడంతోపాటు మరిన్ని ఔషధాలు విడుదల చేయనుండటం ఇందుకు కారణం. పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొదిస్తున్నాం’
– జీవీ ప్రసాద్, రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

