Harish rao | పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు : వీడియో
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Harish rao | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు. అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అంతిమయాత్రలో పాల్గొన్న హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/ZSG6S9acfR pic.twitter.com/R71PNz2LAO
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

