Watch: రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలి.. తర్వాత ఏం జరిగిందంటే?
Peacock Trapped In Train Engine | ప్యాసింజర్ రైలు ఇంజిన్లో నెమలి చిక్కుకున్నది. ఒక రైల్వే స్టేషన్లో దీనిని గమనించారు. దీంతో స్థానికులతో కలిసి రైల్వే పోలీసులు ఆ నెమలిని సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ప్యాసింజర్ రైలు ఇంజిన్లో నెమలి చిక్కుకున్నది. ఒక రైల్వే స్టేషన్లో దీనిని గమనించారు. దీంతో స్థానికులతో కలిసి రైల్వే పోలీసులు ఆ నెమలిని సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Peacock Trapped In Train Engine) మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భూసావల్-బద్నేరా ప్యాసింజర్ రైలు ఇంజిన్ కప్లింగ్ డెక్లో ఒక నెమలి చిక్కుకున్నది. షేగావ్ స్టేషన్కు ఆ రైలు చేరుకోగా ఇంజిన్ ముందు భాగంలో గట్టిగా ఇరుక్కుపోయి బాధపడుతున్న ఆ పక్షిని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే ప్రభుత్వ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు.
కాగా, రైల్వే పోలీసులు, స్థానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలికి ఎలాంటి హాని జరుగకుండా మెల్లగా బయటకు తీశారు. ఆ తర్వాత దానిని అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు వన్యప్రాణి సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఆ ప్యాసింజర్ రైలు ఆ స్టేషన్ నుంచి బయలుదేరింది.
మరోవైపు రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న నెమలిని రక్షించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జాతీయ పక్షిని కాపాడిన రైల్వే, జీఆర్పీ సిబ్బందితో పాటు స్థానికులను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
Poor peacock stuck in MEMU train rescued. Caught in the coupling deck of the Bhusaval-Badnera train, was taken out at Shegaon station. pic.twitter.com/6zdOpKwk9W
— Rajendra B. Aklekar (@rajtoday) July 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

