Elon Musk – Twitter | ఎట్టకేలకు ఎలన్‌మస్క్ 4400 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. తాను డబ్బుల కోసం ట్విట్టర్‌ను కొనుగోలు చేయలేదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. మానవత్వం కోసమే ట్విట్టర్‌ను టేకోవర్ చేశానని చెప్పారు. గురువారం ఆయన టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk).. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. అయితే ఆ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. దాని వీడియోనూ మస్క్ షేర్ చేశారు. ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ట్విట్టర్ సోషల్ నెట్వర్క్ సైట్‌ను 44 బిలియన్ల డాలర్లకు మస్క్ కొనుగోలు చేశారు. ఈ విషయమై డీల్ కుదుర్చుకునేందుకు ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్లారు.
ట్విట్టర్‌ను తొలుత కొనుగోలు చేస్తానని మస్క్ ప్రటించారు. ఆ తర్వాత స్పామ్ ఖాతాల సాకుతో డీల్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పారు. దీంతో ట్విట్టర్, మస్క్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఫేక్ అకౌంట్లు చూపుతూ ట్విట్టర్ మోసాలకు పాల్పడుతున్నట్లు మస్క్ ఆరోపించారు. అయితే డీల్ నుంచి బయటపడేందుకు మస్క్ ఆ ఆరోపణలు చేశారని ట్విట్టర్ పేర్కొన్నది.
ఇటీవల మస్క్ యూ టర్న్ తీసుకున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒరిజినల్ ప్రైజ్‌కే ట్విట్టర్‌తో డీల్‌ను కొనసాగించనున్నట్లు మస్క్ తెలిపారు. దీంతో ఈ కేసును ఈ నెల 28 వరకు వాయిదా వేశారు. ఒకవేళ శుక్రవారం లోగా ట్విట్టర్, మస్క్ మధ్య ఒప్పందం కుదరకుంటే, అప్పుడు ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది.