Chiru vs Rajini |’జైలర్ 2′ రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో రజనీకాంత్, చిరంజీవి బాక్సాఫీస్ పోరు!
Chiru vs Rajini | సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం జైలర్ 2 విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. 2023లో విడుదలైన జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీకాంత్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
Chiru vs Rajini | సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం జైలర్ 2 విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. 2023లో విడుదలైన జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీకాంత్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. అదే విజయోత్సాహంతో ఇప్పుడు ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథను రివీల్ చేయకుండా, ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తూ రూపొందించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈసారి రజనీకాంత్ మరింత ప్రమాదకరమైన మిషన్‌లో కనిపించనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ తమ కీలక పాత్రలను కొనసాగించనున్నారు. అలాగే ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, యోగి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ ఈ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. మరోవైపు, హృతిక్ రోషన్ ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట ఈ పాత్ర కోసం షారుఖ్ ఖాన్ని సంప్రదించినప్పటికీ, ఇతర చిత్రాల బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర అక్టోబర్ 16న విడుదల కానుంది. వరుసగా రెండు రోజుల్లో రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో దసరా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్-చిరంజీవి పోరు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
Alappara Kelappurom! #Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh
— Sun Pictures (@sunpictures) July 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

