కాంగ్రెస్‌తోనే లోకం సర్వనాశనం
ప్రభుత్వ విధానాలపై ఓ మహిళ గళమెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గుర్రాల ఐలమ్మ జీవనోపాధి కోసం సిద్దిపేటలో హోటల్ నిర్వహిస్తున్నది. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘చేయి గుర్తు సరార్తో లోకం సర్వనాశనమైతది. నా చిన్నప్పుడు కూడా ఇట్లనే అయింది.
- ఇప్పుడు కరెంట్ లేదు, నీళ్లు లేవు
- ధరలు పెరిగినయ్.. కిలో బియ్యం వందనట
- కేసీఆర్ సార్ నీళ్లిస్తే సల్లగ బతికినం
- రేవంత్ సర్కార్‌పై ఓ మహిళ తీవ్ర అసంతృప్తి
- సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్
రాజాపేట, నవంబర్ 24: ప్రభుత్వ విధానాలపై ఓ మహిళ గళమెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గుర్రాల ఐలమ్మ జీవనోపాధి కోసం సిద్దిపేటలో హోటల్ నిర్వహిస్తున్నది. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘చేయి గుర్తు సరార్తో లోకం సర్వనాశనమైతది. నా చిన్నప్పుడు కూడా ఇట్లనే అయింది. గిప్పుడేమో నీళ్లు లేక బావులు, బోర్లు ఎండిపోయినయి. మరి నీళ్లు ఎందుకు ఇస్తలేరు? గప్పట్ల కరెంటు ఎప్పుడు పోలే.. ఇప్పుడేమో కరెంటు వస్తలేదు మరి?’ అని ప్రశ్నించింది. ‘నాకు కేసీఆర్ సారు మంజూరు చేసిన రూ.2 వేల పింఛనే వస్తున్నది.
మా పకనోళ్ల పిల్లలను హైదరాబాద్ హాస్టల్లో చేర్పిస్తే నీళ్లు లేవని ఇంటికి పంపిండ్రు. బోర్లు వేస్తే నీళ్లు పడ్తలేవట. ట్యాంకర్లతో నీళ్లు కొనుకోవాల్సి వస్తున్నదట. ధరలు పెరగడంతో నా హోటల్లో గిరాకీ తగ్గింది. రైతులకు సాగునీరు అందక పంటలు పండుతలేవు. వందకు కిలో బియ్యం అమ్మబట్టిరి. వడ్లు పండించడం మాత్రం వద్దనబట్టిరి. రైతుబంధు ఎన్ని మాట్ల వేసినావయ్య?’ అని రేవంత్‌రెడ్డిని నిలదీసింది. ‘గప్పట్ల పెద్దసారు నీళ్లు ఇస్తే లోకమంతా సల్లగా బతికింది’ అని కేసీఆర్‌ను కొనియాడింది. అయితే ఐలమ్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

