బీజేపీకి పాలించే అర్హత లేదు
దేశ పౌరుల ఓట్లను తొలగించిన బీజేపీకి కేంద్రంలో పాలించే అర్హత లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ పార్టీని ఓడించాలని సీపీఎం పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ‘సర్' పేరుతో అక్రమంగా 13 కోట్ల ఓట్లను తొలగించడంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, అదే ఓట్ల తొలగింపునకు మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చి పాదయాత్ర నిర్వహించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్ర అంభ్యంతరాలు వ్యక్తంచేశారు.
- 13 కోట్ల ఓట్లు తొలగించి ‘లోక్తంత్ర బచావో’ అని పాదయాత్ర చేయడం హాస్యాస్పదం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): దేశ పౌరుల ఓట్లను తొలగించిన బీజేపీకి కేంద్రంలో పాలించే అర్హత లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ పార్టీని ఓడించాలని సీపీఎం పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ‘సర్’ పేరుతో అక్రమంగా 13 కోట్ల ఓట్లను తొలగించడంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, అదే ఓట్ల తొలగింపునకు మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చి పాదయాత్ర నిర్వహించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్ర అంభ్యంతరాలు వ్యక్తంచేశారు.
‘లోక్తంత్ర బచావో-అరాజకత హటావో’ అనే నినాదంతో ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. నిజానికి దేశంలో, రాష్ట్రంలో అరాచకత్వాన్ని లేకుండా చేయాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా ముందుగా కేంద్రంలోని బీజేపీని ఓడించాలని కోరారు. చనిపోయిన వారి ఓట్లను, రెండుచోట్ల ఉన్నవారి ఓట్లను తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ ఇకడే పుట్టి పెరిగి పనుల కోసం, వృత్తుల కోసం, బతుకుదెరువు కోసం వలస వెళ్లిన దేశ పౌరులను కూడా చొరబాటుదారులనే నెపంతో శాశ్వతంగా వారిని ఓటు హకుకు దూరం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను దశలవారీగా 2030 నాటికి పూర్తిగా పాఠశాల విద్యలో విలీనం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష ప్రతిపాదనలు సరికాదని పేర్కొన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు చేపట్టే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సమగ్ర చర్చలు జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

