కండ్లముందు గుంతలు కాగితాలపై కోట్ల పద్దులు
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నెముకైన రహదారుల వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అస్తవ్యస్తమైంది. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని 24,245 కి.మీ. రహదారుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది.
- ఆర్అండ్బీ శాఖలో పడకేసిన ప్రగతి
- రూ.9,161 కోట్ల మేర హడో రుణానికి ఆర్థిక శాఖ మోకాలడ్డు
- అటకెకిన 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు.. అటకెక్కిన ప్లాన్
- మరమ్మతులకు రూ.490 కోట్లు కూడా విదల్చని వైనం
- 24,245 కిలోమీటర్ల మేర రోడ్లపై ప్రజల నరకయాతన
రాష్ట్ర ప్రగతికి రహదారులే జీవనాడి. కానీ నేడు తెలంగాణలో ఆ జీవనాడి కృంగి కృశించిపోతున్నది. బడ్జెట్ పుస్తకాల్లో వేల కోట్ల అంకెలు మెరుస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం గుంతలే దర్శనమిస్తున్నాయి. నిధుల విడుదల్లో జాప్యం, పెండింగ్ బిల్లుల వేధింపులతో ఆర్అండ్బీ శాఖ అచేతనంగా మారింది. గతంలో కేసీఆర్ పాలనలో అద్దంలా మెరిసిన రహదారులు నేడు మరమ్మతులకు కూడా నోచుకోక వెక్కిరిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నెముకైన రహదారుల వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అస్తవ్యస్తమైంది. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని 24,245 కి.మీ. రహదారుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇందులో 3,152 కి.మీ రాష్ట్ర రహదారులు.. 12,079 కి.మీ ప్రధాన జిల్లా రహదారులు.. 9,014 కి.మీ ఇతర జిల్లా రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న మార్గాలను పునరుద్ధరించడంలో పాలకులు విఫలమయ్యారు. నిధులు లేక గ్రామాలు, పట్టణాల మధ్య రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైనది. 202627 బడ్జెట్లో ఆర్అండ్బీ ప్రధాన పథకాలకు రూ.6,416 కోట్లు కేటాయించినట్టు రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నది.
ఇందులో హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు, ఆర్ఆర్ఆర్కు రూ.1,525 కోట్లు, నిర్వహణకు రూ.828 కోట్లు, కొత్త రోడ్లకు రూ.450 కోట్లు ప్రతిపాదించింది. సీఆర్ఐఎఫ్ కింద రూ.243 కోట్లు, ఆర్వోబీ, ఆర్యూబీలకు రూ.216 కోట్లు, సచివాలయ భవనాలకు రూ.100 కోట్లు చూపించింది. మరోవైపు మూలధన వ్యయం రూ.5,677 కోట్లు అంటూ అంకెల గారడీ చేస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో పనులను పట్టాలెకించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కొరవడింది.
202526 సవరించిన అంచనా రూ.3,431.47 కోట్లతో పోలిస్తే 202627లో మూలధన వ్యయాన్ని రూ.5,676.76 కోట్లకు పెంచామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ రూ.19,61,701 కోట్ల భారీ రాష్ట్ర జీడీపీలో రహదారులకు ఇచ్చింది కేవలం 0.29 శాతం మాత్రమే. కాగితాలపై కేటాయింపులు పెంచినా, నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు పొంతన లేక పనులు ఎకడికకడ నిలిచిపోయాయి.
హ్యామ్ పనులకు గ్రహణం

రాష్ట్రవ్యాప్తంగా రహదారులు ఆధునీకరిస్తామని ప్రకటించిన హ్యామ్ ప్రణాళిక అటకెకింది. తొలిదశలో 34 ప్యాకేజీల కింద 441 రహదారుల్లో 6,092.37 కి.మీ రోడ్లను రూ.13,006.27 కోట్లతో నిర్మిస్తామని ఊదరగొట్టింది. ఈ పనులకు కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపుల కోసం హడో నుంచి రూ.9,161 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదించింది. కానీ 2026 అక్టోబర్ 30 నాటి నివేదిక ప్రకారం ఆర్థిక శాఖ ఆ రుణానికి ఆమోదం తెలుపకపోవడంతో పనులు ప్రశ్నార్థకంగా మారాయి. హ్యామ్ పథకం పేరుతో సాధారణ మరమ్మతులను సైతం ప్రభుత్వం పూర్తిగా పకనపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు కనీసం రూ.490 కోట్లు అవసరమని అధికారులే చెబుతున్నారు.
అయినా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం గుంతలు పూడ్చే దికులేదు. ఫలితంగా జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆర్అండ్బీ రహదారులతోపాటు పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. హ్యామ్ ప్రణాళికలో పంచాయతీరాజ్ పరిధిలోని 18,472 కి.మీ గ్రామీణ మార్గాలను రూ.6,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. ఆర్అండ్బీ (6,092 కి.మీ), పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం లేక గ్రామీణ రవాణా వ్యవస్థ కుప్పకూలింది.
పంటలను మారెట్లకు తరలించలేక రైతులు, పాఠశాలలు, దవాఖానలకు వెళ్లలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మిస్తామని, బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటనలతోనే కాలయాపన చేస్తున్నది. భూసేకరణ, కేంద్ర, రాష్ట్ర అనుమతులు, నిధుల సమీకరణలో స్పష్టత లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ జపం చేస్తూ సామాన్యులు నిత్యం ప్రయాణించే జిల్లా, గ్రామీణ రహదారులను విస్మరించడం ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనం.
శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు

కేవలం రోడ్లే కాకుండా ప్రభుత్వ భవనాల నిర్వహణలోనూ ఆర్అండ్బీ శాఖ విఫలమైంది. రాష్ట్రంలోని 54.50 లక్షల చదరపు అడుగుల భవనాల (13.13 లక్షల చదరపు అడుగుల నివాసేతర, 41.37 లక్షల చదరపు అడుగుల నివాస భవనాలు) బాధ్యత ఈ శాఖపై ఉంది. నిర్వహణ నిధులు లేక ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. బడ్జెట్ మాయాజాలం మాని, తక్షణమే నిధులు విడుదల చేసి రోడ్లు, భవనాలకు మోక్షం కలిగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
62% నిధులకు కోత పెట్టిన చరిత్ర
బడ్జెట్లో భారీ అంకెలు చూపించడం, ఆ తర్వాత ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. పీఆర్ఎస్ బడ్జెట్ విశ్లేషణ ప్రకారమే 202425లో రోడ్లు, వంతెనలకు రూ.4,795 కోట్లు కేటాయించి.. వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1,827 కోట్లు మాత్రమే. అంటే ఏకంగా 62% నిధులకు కోత పెట్టింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
కేసీఆర్ హయాంలోనే స్వర్ణయుగం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర రహదారులు, భవనాల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆనాడు నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్, కంకర ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. పెరిగిన ధరల భారాన్ని లెకచేయకుండా వేల కోట్లు విడుదల చేసి నాణ్యమైన డబుల్ లేన్, ఫోర్ లేన్ రోడ్లు, వంతెనలు నిర్మించారు.
అద్భుతమైన కొత్త సచివాలయం, సమీకృత కలెక్టరేట్లు, అమరవీరుల జ్యోతి వంటి కట్టడాలను రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో టిమ్స్ దవాఖానల నిర్మాణం, హైకోర్టు భవన నిర్మాణం, నిమ్స్ దవాఖాన విస్తరణ, వరంగల్ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు రూ. 5,000 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ నేటి పాలనలో నిర్మాణ సామగ్రి ధరలు స్థిరంగా ఉన్నా.. ఒక కొత్త బ్రిడ్జి, నాణ్యమైన రోడ్డు నిర్మించలేని అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

