ఉత్కంఠ గొలిపే కథాంశంతో అసరీరి
మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘అసరీరి’. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్నది.
మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘అసరీరి’. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్నది. 96, సత్యం సుందరం వంటి ఎమోషనల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకూ భావోద్వేగపూరితమైన కథలతో ఆకట్టుకున్న దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ తొలిసారి థ్రిల్లర్ కథతో రానున్నారని, ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలతో ఈ సినిమా ఉంటుందని, ఫహాద్ ఫాజిల్ కెరీర్లోనే ఇది భిన్నమైన సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. శివాద కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈచిత్రానికి కెమెరా: మహేంద్రన్ జయరాజు, సంగీతం: గోవింద్ వసంత, నిర్మాత: డా.ఇషారి కె.గణేశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

