న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.2,112.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.486.9 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్లు తెలిపింది. అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోవడం వల్లనే రికార్డు స్థాయి లాభాలను ఆర్జించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం రెండో త్రైమాసికంలో రూ.20,550. 9 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.29,942.5 కోట్లకు ఎగబాకినట్లు తెలిపింది.