Erragutta Checkpost | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా నారాయణపేట పట్టణంలోని ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు సీఐ శివ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షఫీ అనే వ్యక్తి యాదగిరి నుండి మహబూబ్‌నగర్‌కు రూ.1,17,000 నగదును తీసుకెళ్తుండగా ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ నిర్వహించాం. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి సరైన బిల్లులు లేదా ఆధారాలు చూపించలేకపోయాడని.. దీంతో ఎన్నికల నిబంధనల మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం గ్రీవియన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఎవరైనా అనుమానాస్పద నగదు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల