NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్-డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) సినిమాపై అభిమానుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తైన వెంటనే ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్‌తో పాటు హీరోయిన్ రుక్మిణీ వసంత్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సాంగ్‌ను కూడా గ్రాండ్ లెవల్లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలిచే అవకాశముంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని యూనిట్ చెబుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలవాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. అందుకే స్క్రిప్ట్ దశలోనే ఆయన చాలా సమయం కేటాయించాడట. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ బ్లాక్స్ అన్నింటినీ అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ ప్లస్ పాయింట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండటం మరో ప్రత్యేకత. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాను ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.