USA vs PAK | సూపర్ ఓవర్లో పాక్‌ను పడగొట్టిన యూఎస్ఏ.. ఈసారి ఏం చేస్తారో..!
USA vs PAK : ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా బౌలర్లు.. ఈసారి పాక్ ఆటగాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
USA vs PAK : అంతర్జాతీయ క్రికెట్లో అనిశ్చితికి కేరాఫ్ పాకిస్థాన్ జట్టు. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ గత సీజన్ టీ20 ప్రపంచకప్‌లో యూఎస్ఏ చేతిలో కంగుతిన్నది. ఉత్కంఠ పోరులో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్లో మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చింది యూఎస్ఏ. రెండేళ్లు తిరిగాక.. ఇప్పుడు ఇరుజట్లు కొలంబోలో ఢీ కొడుతున్నాయి. సో.. ఈ మ్యాచ్‌పై ఫలితంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా బౌలర్లు.. ఈసారి పాక్ ఆటగాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తాము రెండు మార్పులతో ఆడుతున్నట్టు అతడు చెప్పాడు. మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై అతికష్టంగా నెగ్గిన సల్మాన్ అఘా బృందం.. అమెరికా సవాల్‌ను అధిగమిస్తుందా? లేదా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.
Is a repeat of 2024 on the cards tonight in Colombo?
USA make two changes: Ehsan Adil and Shayan Jahangir come in for Ali Khan and Saiteja Mukkamalla
One change for Pakistan: Usman Tariq replaces Salman Mirza
Follow live: https://t.co/lI9OOynhz0 pic.twitter.com/iVzDKZCLaE
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
యూఎస్ఏ తుది జట్టు : ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), శయన్ జహంగీర్, మొనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్, ఇషాన్ ఆదిల్, సౌరభ్ నేత్రావల్కర్.
పాక్ తుది జట్టు : సయీం ఆయూబ్, సహిబ్జద ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజాం, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారీఖ్, అబ్రార్ అహ్మద్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

