Speaker Om Birla : ప్రతిపక్షాలు తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెట్టడంతో లోక్‌సభ స్పీకర్ (Speaker Om Birla) ఓం బిర్లా (OM Birla) కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయానికి వచ్చారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దాంతోపాటు ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసినా బీజేపీ ఎంపీపైన చర్యలు చేపట్టకపోవడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది.