Hockey World Cup : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు(Team India) రికార్డు విజయం నమోదు చేసింది. ఆరంభ పోరులో చైనాకు ముచ్చెమటలు పట్టించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించి 6-1తో భారీ విక్టరీ కొట్టింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయంతో గ్రూప్ డీ నుంచి అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా.
నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో టీమిండియా దుమ్మురేపింది. మొదటి మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని.. ఒడిసిపడుతూ దక్షిణాఫ్రికాను మట్టికరిపించారు భారత అమ్మాయిలు. గ్రూప్ డీ లీగ్ రెండో పోరులో సఫారీలను కంగుతినిపిస్తూ 6–1తో జయభేరి మోగించింది ఆరెంజ్ ఆర్మీ. ఈ మెగా టోర్నీ చరిత్రలో మొన్నటివరకూ 1974లో స్పెయిన్‌పై 4-1 విజయమే భారత్‌కు అత్యుత్తమంగా ఉండేది. కానీ, ఇప్పుడు అది రెండో స్థానానికి పడిపోయింది.
𝗪𝗵𝗮𝘁 𝗮 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝗶𝗰 𝘀𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗪𝗼𝗺𝗲𝗻’𝘀 𝗧𝗲𝗮𝗺! 🔥
India put on a dominant show to beat South Africa 6-1 and climb to the top of Pool D at the FIH Hockey World Cup Belgium & Netherlands 2026. 🏑💪
A big win. A big… pic.twitter.com/eTaG332IQO
— Hockey India (@TheHockeyIndia) August 18, 2026
ఆట మొదలు నుంచి దూకుడు కనబరిచిన భారత అమ్మాయిలు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దండయాత్ర చేశారు. సునేలితా టొప్పో, నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను, లల్రేమిసియామి, సాక్షి రానాలు తలా ఒక గోల్ కొట్టారు. ఈ విజయంతో 4 పాయింట్లు సాధించిన టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. మరో మ్యాచ్‌లో చైనా ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు ఆగస్టు 20, గురువారం నాడు ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. మరొక్క పాయింట్ సాధిస్తే చాలు రెండో రౌండ్ ఆడడం ఖాయం.