ACB : దేశ రాజధాని ఢిల్లీలోసంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం(Jak Board Scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్(Satyendar Kumar Jain) అరెస్టయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జలబోర్డు సీఈవోగా ఉన్న సమయంలో సత్యేంద్ర సహా ఈ ఐదుమంది రూ.1.52 కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దాంతో, వీరిని విచారించేందుకు మంగళవారం ఏసీబీ బృందం అరెస్ట్ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. జలబోర్డు సీఈవోగా ఉన్న సమయంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల టెండర్ల అనుమతి కోసం సత్యేంద్ర.రూ.1.52 కోట్లు లంచం తీసుకున్నారనే కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది ఏసీబీ.
The Anti-Corruption Branch (ACB), Government of NCT of Delhi has arrested six accused persons:
1. Satyendar Kumar Jain, former Minister of Water, GNCTD,
2. Udit Prakash Rai (IAS), former CEO, Delhi Jal Board,
3. Ankit Srivastava, former contractual consultant, Delhi Jal Board… pic.twitter.com/Q2hxt1Ofgt— ANI (@ANI) August 18, 2026
సత్యేంద్రతో పాటు జలబోర్డు సీఈవో, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, మాజీ కాంట్రాక్ట్ కన్సల్టంట్ అంకిత్ శ్రీవాత్సవ, ఏఎన్ ఎంటర్ప్రైస్ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజ కుమార్ కుర్రా, శ్రీజన్హర్ ప్రొప్రైటర్ పంకజ్ వర్మలను సీబీఐ అరెస్ట్ చేసింది. మురుగునీటి శుద్ది కేంద్రం టెండర్ల ఖరారులో రూ.1.52 కోట్ల లంచం తీసుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఈ ఆరుగురిపై 2024, మే 11వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది.