IND vs WI | తొలి వన్డేలో గ్రీవ్స్ శతకమోత.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
IND vs WI : మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(107) శతకతో కదం తొక్కాడు. భారత బౌలర్లను సమర్దంగా ఎదుర్కొన్న గ్రీవ్స్ మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(62)తో సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు పునాది వేశాడు.
IND vs WI : మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(107) శతకతో కదం తొక్కాడు. భారత బౌలర్లను సమర్దంగా ఎదుర్కొన్న గ్రీవ్స్ మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(62)తో సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు పునాది వేశాడు. కానీ, మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ (4-40) తిప్పేయడంతో విండీస్ టపటపా వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో అమిర్ జంగూ(58 నాటౌట్), రోస్టన్ ఛేజ్(24)లు బ్యాట్ ఝులిపించారు. దాంతో.. భారత్ ముందు 296 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది పర్యాటక జట్టు.
భారత పర్యటన తొలి వన్డేల్లో వెస్టిండీస్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తిరువనంతపురంలోజస్టిన్ గ్రీవ్స్(107), జాన్ క్యాంప్‌బెల్(62)లు ఖతర్నాక్ బ్యాటింగ్‌తో అలరిస్తూ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా బౌలర్లను కాచుకున్ ఈ ద్వయం దూకుడుగా ఆడడంతో విండీస్ స్కోర్ పరుగులు తీసింది. క్రీజులో పాతుకుపోయిన క్యాంప్‌బెల్‌ను పెవిలియన్ పంపిన కుల్దీప్ యాదవ్(4-40) తొలి వికెట్ అందించాడు. 20వ ఓవర్లో అతడు ఫ్లయిట్ చేసిన రెండో బంతిని స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రసిధ్ కృష్ణకు దొరికాడు. దాంతో.. 135 వద్ద తొలి వికెట్ పడింది.
Nothing like that maiden ODI ton 💯✨🔥 pic.twitter.com/QCRdXl1rWu
— Cricinfo (@cricinfo) September 27, 2026
హ్యాట్రిక్ మిస్
అనంతరం కేసీ కార్టీ(13), కెప్టెన్ షాయ్ హోప్(12)లు క్రీజులో నిలవలే. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ 104 బంతుల్లో 12 ఫోర్లతో తొలి శతకం సాధించాడు. భారత గడ్డపై వంద కొట్టిన 13వ కరీబియన్ బ్యాటర్‌గా రికార్డు సాధించిన అతడిని సైతం కుల్దీప్ బోల్తా కొట్టించాడు. 36వ ఓవర్లో మూడో బంతికి గ్రీవ్స్ ఎల్బీగా ఔటవ్వగా.. తర్వాతి బంతికే ఆండ్రూ(0) స్లిప్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. కుల్దీప్ హ్యాట్రిక్‌పై నిలవగా రోస్టన్ ఛేజ్(24).. అందుకు అవకాశమివ్వలే. ఆపై అమిర్ జంగూ(58 నాటౌట్) జతగా ఛేజ్ ఐదో వికెట్‌కు యాభై రన్స్ జోడించాడు. ప్రసిధ్ ఓవర్లో ఛేజ్ క్లీన్ బౌల్డయ్యాక వేగం పెంచిన జంగూ 38 బంత్లులోనే ఫిఫ్టీ సాధించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
Crucial breakthroughs served with a touch of magic ✨
🎥 Watch how Kuldeep Yadav shifted the momentum for #TeamIndia 💙
Updates ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ | @imkuldeep18 pic.twitter.com/nAt1GOrcW2
— BCCI (@BCCI) September 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

