‘మైనారిటీ’లో ఔట్సోర్సింగ్ పెత్తనం
మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం కొనసాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జులుగా కీలకస్థానాల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లపై ఆజమాయిషీ చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
- టెమ్రిస్ల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు
- ఇబ్బందులు పడుతున్న రెగ్యులర్ ఉద్యోగులు
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం కొనసాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జులుగా కీలకస్థానాల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లపై ఆజమాయిషీ చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవహారశైలితో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని సొసైటీ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల్లో లేనివిధంగా మైనారిటీ గురుకుల సొసైటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెత్తనం సాగిస్తున్నారు.
సహాయ కార్యదర్శులుగా నియమితులైన ఎండీ ఖయ్యుమ్(సర్వే సెటిల్మెంట్లు, భూ రికార్డులు), ఎం కృష్ణకుమార్ (పంచాయతీరాజ్‌శాఖలోని ఎంపీడీవో), సబా సుల్తానా(రెవెన్యూశాఖ, తహసీల్దార్), ఆర్థికాధికారిగా జే ప్రభాకర్‌రెడ్డి(ట్రెజరీ) ఇలా అకడమిక్స్‌తో సంబంధం లేనివారికే ప్రధాన విభాగాల బాధ్యతలు అప్పగించారు. ప్రధాన కార్యాలయంలో, ప్రధాన పోస్టుల్లో పాగావేసిన ప్రైవేట్ వ్యక్తులు సొసైటీ ప్రిన్సిపాళ్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా, వారిని సంప్రదించకుండా ఇషారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్సులు ప్రవేశపెట్టడం, ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకం, డైట్ తదితర టెండర్లను ఖరారు చేయడం వంటి కీలక అంశాల్లో చక్రం తిప్పుతున్నారు. కమీషన్ల దందాకు తెరలేపుతూ సొసైటీని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

