ఐఐటీ రామయ్య మహోన్నత మార్గదర్శి
ఐఐటీ రామ య్య ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత మార్గదర్శకుడని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు హరీశ్‌రావు కొనియాడారు.
- సామాజిక కోణంలో విద్య నేర్పిన గురువు: మాజీ మంత్రి హరీశ్‌రావు
అంబర్‌పేట, నవంబర్ 20: ఐఐటీ రామ య్య ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత మార్గదర్శకుడని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు హరీశ్‌రావు కొనియాడారు. స్వాతంత్య్ర, తెలంగా ణ ఉద్యమంలో ప్రజల పక్షాన, న్యాయం, ధర్మం పక్షాన నిలబడ్డారని, అందుకే ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేండ్లు ప్రసాదించారని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య వందో జ న్మదిన వేడుకలు హైదరాబాద్ విద్యానగర్‌లో ని ఆయన స్వగృహంలో శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు.. చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శాలువాతో ఘ నంగా సన్మానించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చుక్కా రా మయ్య మరింతకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపా రు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయన శిష్యులు ఉన్నారని, ఆయన శిష్యులు ఎంతో గర్వంగా చుక్కా రామయ్య తమ గురువు అని చెప్పుకొనే ఉన్నతమైన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. చుక్కా రామయ్య సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కొత్తగా ఎమ్మెల్యేగా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొన్నానని, అనేక సమస్యలు చర్చించానన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

