రామగుండం : కొండా లక్ష్మణ్ బాపూజీ ( Konda Laxman Bapuji ) ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా( CP Amber Kishore Jha ) అన్నారు. ఆదివారంరామగుండం కమిషనరేట్లో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సీపీ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని కృషి చేశారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు, ఆస్తులను సైతం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.
దేశసేవకు, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఆర్ఐ మల్లేశం, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.