లక్నో: వాహనం టైరు పేలడంతో అదుపుతప్పింది. రోడ్డు పైనుంచి పక్కకు వేగంగా జారిపోయింది. ఒక స్తంభానికి ఢీకొట్టి ఆగిపోయింది. ఆ వాహనంలో ప్రయాణించిన బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. (Vehicle Tyre Burst) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా దేబాయి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్, శనివారం ఒక వ్యక్తితో కలిసి టయోటా ఫార్చ్యూనర్‌లో ప్రయాణించారు. లక్నో నుంచి ఆయన తిరిగి వస్తుండగా గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆ వాహనం టైరు పేలింది. దీంతో ఆ ఎస్యూవీ అదుపుతప్పింది.
కాగా, రోడ్డుపై వర్షపు నీరు ఉండటంతో ఆ వాహనం జారిపోయింది. రహదారి నుంచి పక్కకు వేగంగా దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించింది. చివరకు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.
అయితే పోటా కాబుల్పూర్ గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆ ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తిని హాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Wtf 😭
Chandrapal Singh Lodhi, a BJP MLA, landed straight in the field from the Ganga Expressway. 🤣 pic.twitter.com/HTgF3jNPg4— Simpu Singh (@Simpu_SinghIND) September 26, 2026
🚨 BREAKING: बुलंदशहर के डिबाई से BJP विधायक चंद्रपाल सिंह लोधी गंगा एक्सप्रेसवे पर हादसे का शिकार हो गए हैं। उनकी फॉर्च्यूनर कार दुर्घटनाग्रस्त होने से वह घायल हो गए हैं।
मोदी के विकास की रफ्तार में नागपुरी 🍊 छीला गया। 🤣#MannKiBaat #WorldTourismDay#DigitalBossXMarketing pic.twitter.com/rvk86dBoKi— Manakdeep Singh (किसान पुत्र 🌾) (@ManakdeepSingh) September 27, 2026