శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 20:45:18

రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం  సమావేశం కానున్నది.  ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.  రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధివిధానాలపై కూడా  భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. 


logo