‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్ డేట్స్ తెలుసుకోడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా బన్నీ చేతిలో ఉన్నాయి. వరస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి వాటికి డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలోనే పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కు కూడా ఈ విషయంలో ఇప్పటికే సూచనలు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు సుకుమార్.
పుష్ప ఆగస్ట్ 13న విడుదల తేదీ కన్ఫర్మ్ చేయడంతో కాస్త కష్టమైనా కూడా వేగంగానే సినిమాను పూర్తి చేస్తున్నాడు. తన కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫాస్టుగా ఈ సినిమా షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ల్యూడ్ ఎప్రిల్ 3న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రీ ల్యూడ్ అంటే ముందుమాట అని అర్థం. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆ రోజు పుష్ప సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కూడా బయటికి రానున్నాయి. ముఖ్యంగా టీజర్ అప్ డేట్ కూడా అదే రోజు రానుందని తెలుస్తుంది. ఎప్రిల్ 8న విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. అందుకే బర్త్ డే గిఫ్టుగా అభిమానులకు పుష్ప టీజర్ ను ఇవ్వడానికి చూస్తున్నారు.
గతేడాది ఎప్రిల్ 8న పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్ళకు ఎప్రిల్ 3న ప్రీ ల్యూడ్ లోడ్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూల్స్.. హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసాడు సుకుమార్. దాంతో దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు తమిళనాడులోని టెన్కాశిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు అల్లు అర్జున్ అండ్ టీం. టెన్ కాశీలోని ఓ పల్లెటూరిలో హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాడు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. మరోవైపు నారా రోహిత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

