Rajiv Chilaka | పార్ట్నర్ గురించి ఏం తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారు : ఆ ఒక్కటి అడక్కు నిర్మాత రాజీవ్ చిలక
Rajiv Chilaka | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక (Rajiv Chilaka) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Rajiv Chilaka | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక (Rajiv Chilaka) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 03న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా రాజీవ్ చిలక మీడియాతో చిట్ చాట్ చేశారు. సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకోకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ రోజుల్లో లైఫ్‌లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి పెద్ద విషయంగా మారింది. అప్పట్లో బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు పెళ్లి సంబంధం కుదర్చడంలో సాయం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు అందరూ మ్యాట్రిమోనియల్ సైట్లపైనే ఆధారపడుతున్నారు. చాలా మంది తమ జీవితభాగస్వామి గురించి ఏం తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారు.
జీవితంలో అత్యంత ముఖ్యమైన అడుగు కోసం చాలా మంది మ్యాట్రిమోనియల్ సైట్లపై ఆధారపడుతున్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న ఈ కీలక సమస్యను వినోదాత్మకంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాము. ఆ ఒక్కటి అడక్కు కామెడీ, డ్రామా నేపథ్యంలో సాగే భావోద్వేగాల సమ్మేళనం.. అంటూ చెప్పుకొచ్చారు.
ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

