e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home సినిమా శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ష‌న్ లో చేస్తున్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త అవ‌తారంలో క‌నిపిస్తూ సంద‌డి చేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌లో ప‌వ‌న్ శూలం ప‌ట్టుకుని జంప్ చేస్తున్న స‌న్నివేశం స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు కీ రోల్ పోషిస్తాయ‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది.

అయితే తాజాగా సినిమా కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా శూలంతో క‌స‌ర‌త్తులు చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. బ్లాక్ జిమ్ వేర్‌లో ఉన్న ప‌వ‌న్ ట్రైన‌ర్ తో క‌లిసి విన్యాసాలు నేర్చుకుంటున్నాడు. డైరెక్ట‌ర్ క్రిష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రైన‌ర్ సూచ‌న‌లు ఫాలో అవుతున్నాడు ప‌వ‌ర్‌స్టార్. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు కరాటేలో మంచి నైపుణ్యం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ మూవీలో దొంగ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌ని టాక్ వినిపిస్తోంది. 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టును ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.

శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌
శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement