వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
వకీల్ సాబ్ | పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అంజలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు తిరగరాసింది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లైకులు సాధించిన ట్రైలర్ గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటించారు. ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ అంజలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

వకీల్ సాబ్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పింది. ఇందులో తన పాత్ర గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యానని.. ఇలాంటి మంచి కథ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నాను అని చెప్పింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ సెట్లో ఎలా ఉంటాడో అనే విషయంపై కూడా ఓపెన్ అయిపోయింది అంజలి. షూటింగ్ ఉంటే ఓకే.. లేకపోతే కామ్‌గా ఒక మూలన కూర్చుంటారని.. తన పుస్తకాలే తన ప్రపంచం అని చెప్పుకొచ్చింది అంజలి. లేదంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటారని అంజలి చెప్పింది.
ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఒక సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని.. అది చూసి సెట్లో ఉన్న పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టడం తన జీవితంలో మరిచిపోలేని విషయం అంటుంది అంజలి. ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు మరింత పెరుగుతాయని నమ్మకంగా చెబుతోంది ఈ తెలుగమ్మాయి. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది. ఈమె క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్
టక్ జగదీష్ లాంటి సినిమా అరుదుగా వస్తుంది: నాని
విజయ్ సోదరి టాలీవుడ్ ఎంట్రీ..!
ఆ హీరోతో నయన్ రిలేషన్.. సంచలన కామెంట్స్ చేసిన రాధా రవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

