e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్

కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్

కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్

కృతి శెట్టి | హీరోయిన్లకు క్రేజ్ రావడానికి ఎంతో టైమ్ పట్టదు. ఒక్కోసారి ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే స్టార్స్ అయిపోతుంటారు. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తొలి సినిమా విడుదలకు ముందే కృతికి వెల్లువలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వరస అవకాశాలు వస్తున్నాయి. ఉప్పెన సృష్టించిన సంచలనం చూసిన తర్వాత అమ్మాయికి వరస ఆఫర్స్ వస్తున్నాయి. ఈమె డేట్స్ కోసం చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈమె వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇంకా ఇంటర్మీడియట్ చదువుతుంది కృతి శెట్టి. అంతలోనే హీరోయిన్ అయిపోయింది.. తొలి సినిమా విడుదలకు ముందు నుంచే తెలుగులో సత్తా చూపిస్తుంది.

కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్


ఉప్పెన సినిమా విడుదలకు ముందే సుధీర్ బాబు సినిమాలో హీరోయిన్‌గా ఖరారు అయింది కృతి. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈమె కోసం చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కృతి పారితోషికం హాట్ టాపిక్ అవుతుందిప్పుడు. ఏకంగా రూ.70 లక్షల పారితోషికం అడుగుతుందని ప్రచారం జరుగుతుంది. సుధీర్ బాబు సినిమాతో పాటు నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కృతి. మరోవైపు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇకపై సైన్ చేయబోయే సినిమాలకు రూ.70 లక్షలు కూడా కాదు కోటి రూపాయలు కావాలని అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. మొన్న చిరంజీవి కూడా ఈ భామను బుక్ చేసుకోండి.. తర్వాత దొరకదు అంటూ చెప్పుకొచ్చాడు.

కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్


దాంతో కృతికి మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఏదేమైనా ఒక్క సినిమా విడుదల కాగానే అంత పారితోషికం డిమాండ్ చేస్తే అమ్మడు బ్యాగ్ సర్దేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అయితే కృతి శెట్టి పీఆర్ టీం మాత్రం అలాంటివేం లేవని కొట్టి పారేస్తుంది. రెమ్యునరేషన్ గురించి అసలు టాపిక్ రాలేదని.. అవన్నీ ఒట్టి అబద్ధాలే అంటూ తీసి పారేస్తున్నారు. పారితోషికం నిజమా అబద్ధమా అని పక్కనబెడితే తొలి సినిమాకే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం నిజంగానే అద్భుతం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

నివేదా పేతురాజ్ నో కిస్ పాల‌సీ..!

రంగ్ దే జోరుకు బ్రేకులు.. నితిన్‌కు ఇక కష్టమే

ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు

లాహే లాహే లిరిక‌ల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్

న‌వీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!

దిల్ రాజు ఈజ్ బ్యాక్.. ఏం కాంబినేషన్స్ సామీ..!

ప‌వ‌న్ మూవీ సెట్స్ లో ప్ర‌మాదం..ఆదిత్య‌మీన‌న్‌కు గాయాలు..!

ర‌ష్మిక‌కు నాగార్జున ఛాలెంజ్‌.. వీడియో వైర‌ల్‌

ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డంపై ఇస్మార్ట్ భామ ఏమ‌న్న‌దంటే..?

స్కై బ్లూ డ్రెస్ లో క‌ట్టిప‌డేస్తున్న‌ సారా..ఫొటోలు వైరల్‌

వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్

వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ దెబ్బకు రికార్డులు షేక్

సీక్రెట్ డ్రింక్ షేర్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌

కాలేజీకి వెళ్లలేదు..ల‌వ్‌స్టోరీలు క‌నెక్ట్ కావు : రానా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్

ట్రెండింగ్‌

Advertisement