హాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన క్రిస్టొఫర్ నోలాన్ తెరకెక్కించిన టెనెట్ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. గతేడాది కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.12.57 కోట్లు వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, ఎలిజబెత్ డెబిక్కి, రాబర్ట్ పాటిన్సన్, మైకేల్ కెయిన్‌కెన్నెత్, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా నటించారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళ్ వెర్షన్లలోనూ అందుబాటులో ఉండటం విశేషం. ఐమ్యాక్స్ వెర్షన్లలోనే తన మూవీస్‌ను తెరకెక్కించడానికి ఇష్టపడే నోలాన్.. గతేడాది థియేటర్లు తిరిగి తెరిచే వరకూ తన మూవీని రిలీజ్ చేయలేదు.
ఇవి కూడా చదవండి..