డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ

ముంబై : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బాలీవుడ్ నటుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ కేసులో ఫరూఖ్ బటాటాను కూడా నిన్న 8 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన కుమారుడు షాదాబ్‌ను గత వారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ డ్రగ్స్ కేసులో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేసినందుకు 2020, ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు.
ఇవి కూడా చదవండి..
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Azaj Khan
- Drugs Case
- Mumbai
- NCB
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

