ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు

- అర్ధరాత్రి వరకు పౌర సేవా కేంద్రాలు
- చెల్లించకపోతే అపరాధ రుసుము
- ఆస్తిపన్ను లక్ష్యం రూ.1900 కోట్ల్లు
- వసూలైంది రూ.1560 కోట్లు
ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల నిర్ధేశిత టార్గెట్‌లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు రూ.1559.38కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19, వందేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, వరుసగా జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ 82శాతం మేర వసూళ్లను రాబట్టడం గమనార్హం. కాగా చివరి రోజు ఆస్తిపన్ను చెల్లింపు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
నేటి అర్ధరాత్రి వరకు సిటిజన్ సర్వీస్ కేంద్రాలు ఓపెన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లించడానికి వీలుగా బుధవారం (నేడు) జీహెచ్ఎంసీలోని అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆస్తిపన్ను చెల్లించడానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆస్తిపన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఆస్తిపన్ను చెల్లించడానికిగాను సిటిజన్ సర్వీస్ సెంటర్లన్నీ రాత్రి12 గంటల వరకు పనిచేస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా తమ ఆస్తిపన్నును చెల్లించవచ్చని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- property tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

