ముంబై: దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్క్‌లు తప్పనిసరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలంటూ చేస్తున్న వినూత్న ప్రచారం ఆకట్టుకుంటోంది.
1996లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ఆజ్ మై ఊపర్.. ఆస్మాన్ నీచే సాంగ్‌కు కాస్త ట్విస్ట్ ఇచ్చి వాళ్లు చేసిన ట్వీట్ ఇప్పడు వైరల్ అవుతోంది. ఆజ్ మై ఊపర్.. కాజ్ మాస్క్ హై నీచే (మీ మాస్క్ కిందికి ఉంది కాబట్టి నేను పైన ఉన్నాను) అని వైరస్ అంటున్నట్లుగా ఓ ట్వీట్ క్రియేట్ చేసి మాస్క్‌లపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సాంగ్ ఖామోషీ మూవీలోనిది. అందుకే చివర్లో వైరస్‌ను ఖామోష్ చేయాలంటే మీ మాస్క్‌ను సరిగ్గా ధరించండి అంటూ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..