చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ

వాషింగ్టన్: అమెరికా అణ్వాయుధాలను నిర్వహించే సంస్థ యూఎస్ స్ట్రేటజిక్ కమాండ్ నుంచి వచ్చిన ట్వీట్ కలకలం రేపింది. కొందరు ఇదేదో న్యూక్లియర్ లాంచ్ కోడ్ అన్నారు. మరికొందరు పెంటగాన్ హ్యాకింగ్‌కు గురైందేమో అనుకున్నారు. ఇంకొందరు రాజకీయ కుట్రదారులకు ఇదొక సిగ్నల్ అని భావించారు. ;l;;gmlxzssaw, ఇలా అర్థం కాని భాషలో ఉన్న ఆ ట్వీట్ చాలా గందరగోళానికి గురి చేసింది. చివరికి దీనిపై యూఎస్ స్ట్రేటజిక్ కమాండే అధికారికంగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఓ చిన్నారి పొరపాటును వాళ్ల ట్విటర్ హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ ఇదని, దీనిని డిలీట్ చేసినట్లు ఆ సంస్థ చెప్పింది. అమెరికా మిలిటరీకి సంబంధించిన అణ్వాయుధాలు, మిస్సైల్ డిఫెన్స్‌లను ఈ యూఎస్ స్ట్రేటజిక్ కమాండ్ నిర్వహిస్తుంది. అలాంటి సంస్థ ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చే ప్రతి ట్వీట్‌నూ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. ఈ ట్విటర్‌ను చూసే ఉద్యోగి ఒకరు ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో ఇంట్లోని చిన్నారి పొరపాటున ఆ ట్వీట్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో సీక్రెటేమీ లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

