Watch: తన పిల్లలను కాపాడి.. మంటల్లో చిక్కుకుని మరణించిన మహిళ
Woman Saves Children, Lost Life | ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం అంతా పొగలు, మంటలు వ్యాపించాయి. ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ముగ్గురు పిల్లలతో పాటు మేనల్లుడిని నిచ్చెన సహాయంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోకి సురక్షితంగా చేర్చించి. అయితే అగ్నిప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
లక్నో: ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం అంతా పొగలు, మంటలు వ్యాపించాయి. ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ముగ్గురు పిల్లలతో పాటు మేనల్లుడిని నిచ్చెన సహాయంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోకి సురక్షితంగా చేర్చించి. అయితే ఆ అగ్నిప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. (Woman Saves Children, Lost Life) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. మే 12న రాత్రి 9 గంటల సమయంలో బిల్డింగ్ కింది అంతస్తులోని షాప్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే ఆ భవనం అంతా వ్యాపించాయి.
కాగా, ఆ బిల్డింగ్ పై అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తున్నది. మంటలు వ్యాపించడంతో బయటకు వెళ్లే మార్గం లేక కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. ప్రాణాలు దక్కించుకునేందుకు బిల్డింగ్ పైభాగానికి వారు చేరుకున్నారు.
మరోవైపు తన పిల్లలను కాపాడేందుకు తల్లి అర్చన పెద్ద సాహసం చేసింది. ఏడాది వయస్సున్న పసి బిడ్డను ఒక దుప్పటిలో చుట్టింది. 12 అడుగుల ఎత్తు నుంచి పక్కనే ఉన్న ఇంటి డాబా మీదకు జాగ్రత్తగా జారవిడిచింది. ఆ ఇంటి నివాసితులు ఆ దుప్పటి పట్టుకుని బిడ్డను సురక్షితంగా లోపలకు లాగారు.
ఆ తర్వాత నిచ్చెన సహాయంతో 13, 10 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలను అర్చన కాపాడింది. ఎదురుగా ఉన్న ఇంటి డాబా మీదకు వారిని సురక్షితంగా చేర్చింది. తన మేనల్లుడిని కూడా ఆమె రక్షించింది. అయితే దట్టంగా కమ్ముకున్న పొగలు, వ్యాపించిన మంటల్లో అర్చన చిక్కుకున్నది. అక్కడ నుంచి బయట పడలేకపోయింది. తీవ్రంగా కాలిన గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
కాగా, అర్చన 13 ఏళ్ల కుమార్తె కూడా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. టెర్రస్ పై నుంచి దూకిన వదిన కాలు విరగడంతో ఆమె కూడా చికిత్స పొందుతున్నది. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పలు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే అర్చన చాలా ధైర్యం, సాహసంతో తన పిల్లలను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A mother’s love knows no limits ❤️🔥
In Prayagraj, Archana Keservani gave her life to save her three children from a raging fire. She wrapped her 1-year-old son and threw him to safety from 12 feet, helped her daughters escape, then lost her own life.
True love is a mother’s last… pic.twitter.com/lAX3KSvkYJ— Kate❤️🔥💕 (@katee_K1) May 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

