EAPCET ర్యాంకుతో సంబంధం లేకుండా మంచి ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు పొందవచ్చా?
ఇంటర్ పూర్తి అయింది. ఎప్‌సెట్ కూడా రాశారు. కానీ ఆశించిన ర్యాంకు రాలేదు. ఇక మంచి కాలేజీలో బీటెక్ చదవలేమా..? భవిష్యత్తు ఆగిపోయిందా..? మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలివే.
ఇంటర్ పూర్తి అయింది. ఎప్‌సెట్ కూడా రాశారు. కానీ ఆశించిన ర్యాంకు రాలేదు. ఇక మంచి కాలేజీలో బీటెక్ చదవలేమా..? భవిష్యత్తు ఆగిపోయిందా..? మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలివే.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కలలతో ఎప్‌సెట్ పరీక్ష రాస్తున్నారు. అయితే అందరికీ మంచి ర్యాంకులు రావడం సాధ్యం కాదు. కొంతమంది విద్యార్థులు కేవలం కొన్ని మార్కుల తేడాతో మంచి కాలేజీలను కోల్పోతుంటే.. మరికొందరు కౌన్సెలింగ్ ప్రక్రియ, మేనేజ్మెంట్ కోటా, ప్రత్యామ్నయ అడ్మిషన్ అవకాశాలపై సరైన అవగాహన లేక నిరాశలోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఇప్పుడు ఆశాకిరణంగా మారుతోంది “కాలేజ్ మెంటర్”. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో రాజశేఖర్ ప్రారంభించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులకు సరైన కాలేజీలు, కోర్సులు ఎంపిక చేయడంలో సహాయం చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఎప్‌సెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా కూడా ఏ ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు..? ఎంత ఫీజు ఉంటుంది..? ఏ బ్రాంచ్‌కు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? హాస్టల్, ట్రాన్స్పోర్ట్, ప్లేస్‌మెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది..? విద్యార్థి మార్కులకు తగ్గట్టు ఏ కాలేజీ సరిపోతుంది..? విద్యార్థి ఆలోచనలకు అనుగుణంగా కోర్సులు నిర్ణయించుకోవడంలో కూడా ఉచితంగా గైడెన్స్ ఇస్తున్నామని కాలేజ్ మెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు “ర్యాంక్ రాలేదు అంటే ఇంజినీరింగ్ అయిపోయింది” అనే భావనలో ఉండేవారని.. కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్లు, ప్రత్యేక సీట్ల ద్వారా అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే సరైన సమాచారం లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు అవసరానికి మించిన ఫీజులు చెల్లించడం.. లేదా నాణ్యతలేని కాలేజీల్లో చేరడం జరుగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజ్ మెంటర్ వంటి గైడెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు, ఫీజులు, బ్రాంచ్ డిమాండ్, ప్లేస్మెంట్ రికార్డులపై విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు కాలేజ్ మెంటర్ సంస్థ పేర్కొంటోంది. ముఖ్యంగా CSE, AI, Data Science, Cyber Security వంటి కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఏ కాలేజీ ఎంపిక చేసుకోవాలి అనే విషయంలో విద్యార్థులు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కాలేజీ పేరు కాకుండా ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ కనెక్టివిటీ, ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్, ఫీజు భారం వంటి అంశాలను కూడా పరిశీలించాలంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా కూడా కాలేజ్ మెంటర్ గైడెన్స్ ఇస్తుండటం విశేషం.
“ర్యాంక్ కంటే సరైన మార్గదర్శకం ముఖ్యం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న కాలేజ్ మెంటర్ ప్రస్తుతం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎంసెట్ ఫలితాలతో నిరాశ చెందిన విద్యార్థులకు “ ఇంకా మరిన్ని మంచి అవకాశాలు మీ ముందున్నాయి “ అనే సందేశాన్ని కాలేజ్ మెంటర్ ఇస్తోంది. కాలేజీల గురించి, ఫీజులు, హాస్టల్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే.. వెంటనే ఈ నంబర్‌ను 7997166666 సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

