నల్లగొండ సిటీ, ఆగస్టు 17 : పీఆర్సీ, వైటీపీఎస్ (AHP- CHP) ప్రైవేటీకరణ, ఆర్టిజన్ ఉద్యోగుల APSEB సర్వీస్ రూల్స్, EPF నుండి GPF, శాంక్షన్ పోస్టులు తదితర 14 డిమాండ్ల విషయంలో విద్యుత్ ఉద్యోగ & ఆర్టిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా TGPEJAC ఆధ్వర్యంలో ఈ నెల 19న విద్యుత్ సౌదా, హైదరాబాద్ నందు “మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లుగా TGPEJAC నల్గొండ నాయకులు తెలియపరుస్తూ.. ఈ “మహా ధర్నా” కు సంబంధించిన పోస్టర్ ని నేడు సర్కిల్ ఆఫీసు, నల్గొండ నందు ఆవిష్కరణ చేశారు.
మన హక్కుల కోసం, బాధ్యతల కోసం, సంస్థ సంరక్షణ కోసం జరిగే ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై, ప్రతి ఒక్క ఆర్టిజన్ పై ఉందని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జేఏసీ చైర్మన్ నిమ్మ చెట్ల వెంకటయ్య, జేఏసీ కో చైర్మన్ నాగేశ్వరరావు, సెక్రటరీ జనరల్ ఎండీ.నిరంజన్ అలీ, సీహెచ్.రాజు, పి.వి.నాయక్, ఎండీ.పర్వీజ్, డీఈ టెక్ నాగ ప్రసాద్, డివిజన్ జేఏసీ నాయకులు కె.సమ్మిరెడ్డి, పి.రాంబాబు, డి.కోటి, జి.భీమ్ అర్జున్ రెడ్డి, కమల ప్రశాంతి, సునీత పాల్గొన్నారు.

’19న విద్యుత్ సౌదా వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలి’
విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ అమలు, ఇతర ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 19న విద్యుత్ సౌద ఎదుట జరిగే మహా ధర్నా కార్యక్రమానికి సోమవారం NSHES గేట్ వద్ద విద్యుత్ ఉద్యోగులు పోస్టర్ విడుదల చేశారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.