SIR Notice | సర్ నోటీసు వస్తే.. ఇంటికే బీఎల్వోలు.. వ్యక్తిగత హాజరు విషయంలో ఈసీ ఊరట!
SIR Notice | రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ప్రకటన చేసింది. ‘సర్' నోటీసులు అందుకున్న ఓటర్లు బూత్ లెవల్ అధికారులను(బీఎల్వో) కలువాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
SIR Notice | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ప్రకటన చేసింది. ‘సర్’ నోటీసులు అందుకున్న ఓటర్లు బూత్ లెవల్ అధికారులను(బీఎల్వో) కలువాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఇకపై అలాంటి వ్యక్తులను పత్రాల సమర్పణ, వ్యక్తిగత విచారణ కోసం ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఏఈఆర్వో) కార్యాలయానికి పిలువొద్దని వెల్లడించింది. బీఎల్వోలే సదరు ఓటర్ల ఇండ్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను ఈసీఐనెట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్నవారికి ఊరట కల్పించింది. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో శనివారం జరిగిన సమావేశంలో ఈసీ ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ పీ పవన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈసీ తాజా నిర్ణయం ప్రకారం.. ‘సర్’ నోటీసులు జారీ అయిన వ్యక్తుల ఇండ్లకు ఇకపై బీఎల్వోలే స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించనున్నారు. అనంతరం ఆ పత్రాలను ఈసీఐనెట్ యాప్లో అప్లోడ్ చేసి ఈఆర్వో నిర్ణయానికి పంపిస్తారు. ఈఆర్వో ప్రత్యేక పరిస్థితిగా భావించిన సందర్భాల్లో మాత్రమే విచారణ నిర్వహించవచ్చు. అలాంటి విచారణలు కూడా సాధ్యమైనంతవరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అవసరమైతే ఓటరు తరఫున కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడైనా విచారణకు హాజరయ్యేలా అధికారం ఇవ్వవచ్చని తెలిపింది. ‘సర్’ కోసం ఫామ్-6కు జతచేసిన డిక్లరేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ప్రకారం సంబంధిత ఫామ్లనే ఉపయోగించనున్నట్టు స్పష్టం చేసింది. ఫీల్డ్ అధికారులు తమ చట్టబద్ధ అధికారాలకు అనుగుణంగా ఈసీఐనెట్ వ్యవస్థలో యాక్సెస్ కలిగి ఉంటారని తెలిపింది. అయితే ఈసీఐనెట్ వ్యవస్థ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదా? లేదా అనే అంశాన్ని మరోసారి పరిశీలించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఇకపై ఐటీ మాడ్యూళ్లు, పోర్టళ్లకు సంబంధించిన కొత్త కార్యక్రమాలను ఎన్నికల సంఘం ఆమోదించే ముందు ఆఫీసర్స్ కమిటీలో చర్చించనున్నట్టు ఈసీ స్పష్టంచేసింది.
20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ పూర్తి
బిహార్, పశ్చిమబెంగాల్ సహా మొత్తం 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ ఇప్పటికే పూర్తయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ‘సర్’ సందర్భంగా లేదా అనంతరం తమ పేరు ఓటరు జాబితాలో లేనివ్యక్తులు, యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేయబోయేవారు నిరంతర నవీకరణ ప్రక్రియ ద్వారా సంబంధిత ఈఆర్వోకు దరఖాస్తు చేసుకుని పేర్లను చేర్చుకోవచ్చని తెలిపింది. ఇలాంటి దరఖాస్తులకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఓటర్ల నమోదుకు సీఈవోలు, డీఈవోలు, ఈఆర్వోలు వెంటనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. ‘సర్’ మూడో దశలో మిగిలి ఉన్న12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తుది ప్రచురణ పూర్తయిన తర్వాతే మొత్తం ఓటర్ల సంఖ్యపై స్పష్టమైన తుది గణాంకాలు తెలుస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

