న్యూఢిల్లీ : జాతీయ ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్కు పద్మభూషణ్ సరిపోదని.. ఆయన్ను ప్రధానమంత్రిని చేయాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సెటైర్లు వేశారు. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య వ్యాఖ్యలకు పవన ఖేరా ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. శనివారం బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ కనీసం పద్మ భూషణ్ అవార్డుకు అర్హుడని తెలిపారు.
బెంగాల్లో ఎన్నో ఏండ్ల తర్వాత శాంతియుతంగా ఎన్నికలు జరిగాయని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లను తొలగించారని చెప్పారు. జ్ఞానేశ్ కుమార్ వల్లే ఓటర్లు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ఆయన వ్యాఖ్యలపై పవన్ ఖేరా స్పందిస్తూ.. జ్ఞానేశ్ కుమార్ చేసిన పనులకు పద్మభూషణ్ చిన్నదని.. ప్రధాన మంత్రిని చేస్తే సరిపోతుందన్నారు. ఇతరులను ప్రధానిని చేస్తున్న జ్ఞానేశ్ కుమార్కు అదే పదవి ఇస్తే అయిపోతుందని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జ్ఞానేశ్ కుమార్ తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.