ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో మాదారం నవీన్ అనే యువకుడి మొబైల్ ఫోన్ ( Mobile Phone Explodes ) అకస్మాత్తుగా పేలిపోవడంతో కలకలం రేగింది. నవీన్ తన మోటరోలా కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్‌ను జేబులో పెట్టుకుని వెళ్తుండగా ఒక్కసారిగా ఫోన్ వేడెక్కినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే జేబులో నుంచి ఫోన్‌ను బయటకు తీసే ప్రయత్నం చేయగా అది ఒక్కసారిగా పేలిపోయింది.
అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో నవీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తృటిలో తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ వేడెక్కి పేలిపోవడంతో గ్రామంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.