Prashant Kishor | బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor | బీహార్లోని బంకీపూర్ ఉపఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
పాట్నా: బీహార్లోని బంకీపూర్ ఉపఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా ఆయన ఎదిగారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన జేఎస్పీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనైనా గెలువలేదు.
కాగా, బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. మొత్తం 64,151 ఓట్లు సాధించిన ఆయన, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 19,324 ఓట్ల తేడాతో గెలుపొందారు. నీరజ్ కుమార్ 44,827 ఓట్లు సాధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bankipur
- Bihar
- Bypoll
- Landmark Win
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

