Dasoju Shravan Kumar | ములుగు, పరకాలలో ముఖ్యమంత్రి బూతుల పరంపర కొనసాగించారు రేవంత్ రెడ్డి సైకోలా మారిపోయాడని.. రేవంత్ రెడ్డి అల్పులా..సజ్జనుడా చెప్పాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాసోజు మాట్లాడుతూ..గాంధీ పెట్టిన పార్టీకి ముఖ్యమంత్రివేనా రేవంత్ రెడ్డి. వీధి రౌడీలా మాట్లాడటం రాజకీయమా. తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా..? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ ను భస్మం చేస్తుంది . రేవంత్ రెడ్డిని తన భాషే భస్మం చేస్తుంది. రేవంత్ రెడ్డి 18 గంటలు పని చేసి రాష్ట్రానికి ఏం చేశావు. 78 సార్లు డిల్లీకి మూటలు మోసావు అని దాసోజు అన్నారు.
మోసగాళ్లకు మోసగాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లాంటి కేటుగాడు మరొకరు లేరని దాసోజు ఫైర్ అయ్యారు. కోర్టుల్లో కేసులు వేయించి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ఆపేశారు. పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణను బొక్కా బోర్లా పడేశారు. చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో గద్దల లెక్క వాలి భూములను దోచుకుంటున్నారు. మ్యానిఫెస్టోలో సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని పెట్టలేదు..అలా పెట్టామని చెబితే అరగుండుతో తిరుగుతానన్నారు.
రేవంత్ రెడ్డికి సోషల్ జస్టిస్ కు అర్థం తెలుసా..? రేవంత్ రెడ్డి ది సోషల్ జస్టిస్ కాదు ..అనుముల జస్టిస్ మీనాక్షి నటరాజన్ కు దండం పెట్టి చెబుతున్న రేవంత్ రెడ్డిని నందిగ్రామ్ లో శిక్షణకు పంపించండి. ముఖ్యమంత్రి తన అనుచరుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాడు. వి హనుమంత రావుకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి డబ్బు సంచులు దొబ్బి ఎవరెవరి గొంతు కోశాడో నాకు తెలుసు. నా గొంతు కోసి కోదండరాం ను ఎమ్మెల్సీ చేశాడు. రేవంత్ రెడ్డి.. కోదండ రామ్ ను శిఖండిలా పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నాడడని దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి ప్రెసిడెంట్ గా చేశాననటం దొరరికం.. ఫ్యూడల్ మనస్తత్వం. రేవంత్ రెడ్డి నీ ఆస్తులపై చర్చకు రావాలి. త్వరలోనే కాందీశీకుల భూములపై పడతారు. .రేవంత్ రెడ్డి.. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు లాంటోడు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు.. దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావును ఎదుర్కో అని సవాలు విసిరారు. అందరి ఇళ్లలో పంచాయతీలు ఉంటాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అందరి ఇళ్లలో తొంగి చూస్తున్నావా..?తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి కుటుంబం ఎందుకు వెళ్లలేదు. రాహుల్ మీనాక్షి జోక్యం చేసుకుని రేవంత్ తీరు ను మారిస్తే మంచిది .లేదంటే కాంగ్రెస్ కు సమాధి తప్పదు.
తిరుపతి రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీలు ఎందుకు తీసి వేయించావు. కేటీఆర్ ,హరీష్ రావు ఉద్యమకారులు.. రేవంత్ ఎప్పటికైనా తెలంగాణ ద్రోహీ. కాంగ్రెస్ మేనిఫెస్టో లో కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ఉంటే నేను గుండు గీసుకుంటా ..చెప్పకపోతే రేవంత్ గుండు గీసుకుంటారా ?..కేసీఆర్ కు తెలంగాణ అంతా ఓకే కుటుంబం అని స్పష్టం చేశారు.
గాంధీ పెట్టిన పార్టీకి నువ్వు ముఖ్యమంత్రివా రేవంత్ రెడ్డి?
అధికార మదంతో ఒక వీధి రౌడీలాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు.
భస్మాసురుడి లాగా తనను తానే నాశనం చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డి భాషే రేవంత్‌ను భస్మం చేస్తుంది– ఎమ్మెల్సీ… pic.twitter.com/wcPw4NvSNZ
— BRS Party (@BRSparty) August 17, 2026