Watch: సఫారీ వాహనంపై ఖడ్గమృగం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Rhino Attacks safari jeep | సఫారీ జీప్‌పై ఒక ఖడ్గమృగం దాడి చేసింది. తన కొమ్ముతో ఆ వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ జీప్‌లో ఉన్న టూరిస్టులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గువాహతి: సఫారీ జీప్‌పై ఒక ఖడ్గమృగం దాడి చేసింది. తన కొమ్ముతో ఆ వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ జీప్‌లో ఉన్న టూరిస్టులు భయాందోళన చెందారు. (Rhino Attacks safari jeep) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలోని మానస్ జాతీయ పార్కులో ఈ సంఘటన జరిగింది. ఆదివారం కొంత మంది టూరిస్టులు పలు వాహనాల్లో సఫారీకి వెళ్లారు.
కాగా, ఒక భారీ ఖడ్గమృగం ఆ వాహనాలకు ఎదురుగా వచ్చింది. ముందు ఆగిన సఫారీ జీప్‌పై అది దాడి చేసింది. తన కొమ్ముతో ఆ వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో అది బలంగా ఊగిపోయింది. అందులో ఉన్న టూరిస్టులు భయాందోళన చెందారు.
మరోవైపు డ్రైవర్ మెల్లగా ఆ వాహనాన్ని అక్కడి నుంచి ముందుకు నడిపాడు. ఆ ఖడ్గమృగం బారి నుంచి సందర్శకులను కాపాడాడు. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ జరుగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Close shave for tourist in Manas National Park when a rhino almost lifted a safari jeep by its horn. The drive however managed to move out safely. The incident too place in Bansbari range of the national park of Assam. #rhino #rhinosafari pic.twitter.com/P5PtQd3tvb
— Preeti Sompura (@sompura_preeti) May 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- attacks
- flip
- National Park
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

