దిల్ రాజు ఈజ్ బ్యాక్.. ఏం కాంబినేషన్స్ సామీ..!
దిల్ రాజు | తెలుగులో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎందుకంటే ఒక్క ఏడాది కూడా ఖాళీగా ఉండడు. కుదిరితే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు చేస్తాడు.

తెలుగులో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎందుకంటే ఒక్క ఏడాది కూడా ఈయన ఖాళీగా ఉండడు. కుదిరితే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు కూడా విడుదల చేసేంత సత్తా ఉన్న నిర్మాత ఈయన. ఒకప్పుడు రామానాయుడు లాంటి నిర్మాతలు ఫాలో అయిన పద్దతిలోనే ఇప్పుడు దిల్ రాజు కూడా వెళ్తున్నాడు. అప్పట్లో మూవీ మొఘల్ చిన్న సినిమాలతో పాటు భారీ సినిమాలు కూడా నిర్మించేవాడు. ఇప్పుడు దిల్ రాజు ఇదే చేస్తున్నాడు. ఓ వైపు చిన్న సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు భారీ సినిమాలతో వస్తున్నాడు. కొన్నాళ్లుగా చిన్న సినిమాలు నిర్మిస్తున్న ఈయన.. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో సిద్ధమైపోయాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో వరసగా భారీ సినిమాలు నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాలతో రచ్చ చేయాలని చూస్తున్నాడు. రాబోయే నాలుగు సినిమాలకు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఈయనే నిర్మించాడు. ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. దాంతో పాటు ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో సినిమాను కూడా ప్రకటించాడు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రూ.130 కోట్లతో నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం మొదలు కానుంది.

మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని నిర్మించాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సలార్ సినిమా వస్తుంది. దాంతో పాటు మరో సినిమాను కూడా చేయాలని చూస్తున్నాడు.

షాహిద్ కపూర్‌తో హిందీలో జెర్సీ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. అల్లు అరవింద్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమాను కూడా లైన్లో ఉంచాడు ఈయన. ఇప్పటికే ఆర్య, పరుగు, డిజే సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడు 4వ సారి ఈ కాంబినేషన్లో సినిమా రానుంది.

తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లైన్లోకి తీసుకొస్తున్నాడు దిల్ రాజు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ డేట్స్ కోసం కూడా చర్చలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రానుంది. ఇన్ని భారీ సినిమాలు ఒకేసారి పట్టాలెక్కించడం అంటే అది కేవలం దిల్ రాజుకు మాత్రమే సాధ్యమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
రష్మికకు నాగార్జున ఛాలెంజ్.. వీడియో వైరల్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
లవ్ స్టోరీ విడుదల వాయిదా..? మేకర్స్ క్లారిటీ
రామ్‌సేతులో అక్షయ్ కుమార్ లుక్ ఇదేనా ?
కారు ప్రమాదంలో యువ గాయకుడు మృతి
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండబోతుంది?
రెండు సాంప్రదాయాలలో మెహ్రీన్ కౌర్ వివాహం..!
పొట్టి దుస్తులలో అనసూయ హోలీ సంబురాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

