బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన ప్రతి మూవీ హిట్టే అన్న విషయం తెలుసు కదా. ఆమె భర్త రణ్వీర్తో కలిసి నటించిన రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. సిల్వర్ స్క్రీన్‌పై దీపికా, రణ్వీర్ జోడీ హిట్ అవడానికి కారణం భన్సాలీయే. కానీ అలాంటి భన్సాలీపై ఇప్పుడు దీపికా అలిగిందట. దీనికి కారణంగా భన్సాలీ లేటెస్ట్ మూవీ గంగూభాయ్ కథియావాడిలో తనకు లీడ్ రోల్ ఆఫర్ చేయకపోవడమే అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో గంగూభాయ్‌గా ఆలియా భట్ నటించింది. ఇప్పటికే రిలీజైన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే నిజానికి ఈ క్యారెక్టర్లో ఆలియా కంటే దీపికా అయితే బాగుంటుందని కూడా చాలా మంది ఫ్యాన్స్ భావించారు. దీపికా కూడా ఇది తన క్యారెక్టరే అనుకున్నదట. కానీ తనకు ఆఫర్ ఇవ్వకుండా ఆలియా దగ్గరికి వెళ్లడంతో భన్సాలీపై ఆమె అలిగినట్లు స్పాట్బాయ్ అనే న్యూస్సైట్ చెబుతోంది. ఆమె అలక తీర్చడానికి ఇదే మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను భన్సాలీ ఆఫర్ చేశాడని, అయితే దానికి ఆమె నిరాకరించినట్లు కూడా స్పాట్బాయ్ చెప్పింది. అయితే భన్సాలీ ఈ మూవీని మొదలుపెట్టే సమయానికి దీపికా.. సప్నా దీదీ అనే మూవీలో ఫిమేల్ గ్యాంగ్‌స్టర్ రోల్ ప్లే చేస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో భన్సాలీ ఈ ఆఫర్‌ను ఆలియాకు ఇచ్చాడని, త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్‌లో ఈ ఇద్దరూ కలిసి పని చేస్తారని కూడా ఆ వర్గాలు చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి..
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం