నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ

హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. భానుడి ప్రతాపానికి ఎండ మండిపోతున్నది. తెలంగాణలో ఈ సీజన్లోనే అత్యధికంగా సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. జీహెచ్ఎంసీలోని ఖైరతాబాద్ గణాంకభవన్ వద్ద 40.1 డిగ్రీలు రికార్డయింది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 25.9 డిగ్రీల మధ్య నమోదైంది. ఆదివారం 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించింది. రాష్ట్రంలో ఒకటిరెండు ప్రదేశాల్లో మూడురోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

